ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 7:59 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయాలి,బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు

సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయాలి,బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు.

తాండూర్: అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 13.

గోదావరిఖనిలో ఈ నెల 14వ తేదీన సాయంత్రం 5 గంటలకునిర్వహించనున్న సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. తాండూర్ మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభలో పాల్గొనాలని కోరారు.ఈ నేపథ్యంలో మంగళవారం తాండూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో దుర్గం చిన్నయ్య సమావేశమయ్యారు. గోదావరిఖనిలో జరగనున్న బహిరంగ సభకు సంబంధించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, కార్మికులు సభకు తరలివచ్చేలా కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై చర్చించారు. సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని నాయకులకు సూచించారు.బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సింగరేణి కార్మికుల సమస్యలు, వారి హక్కులు, కార్మికులకు సంబంధించిన అంశాలపై నిర్వహిస్తున్న ఈ సభకు తాండూర్ మండలం నుంచి కార్మికులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావాలని దుర్గం చిన్నయ్య కోరారు.మండలంలోని పార్టీ నాయకులు గ్రామస్థాయిలో కార్యకర్తలకు సమాచారం అందించి, సభకు తరలివచ్చేలా సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో  బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దత్తు మూర్తి,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ పురుషోత్తం  గౌడ్,మాజీ ఎంపీపీ పూసల ప్రణయ్ కుమార్,మాజీ జడ్పిటిసి మంగపతి సురేష్ బాబు,మండల బిఆర్ఎస్ నాయకులు గట్టు సంతోష్ కుమార్,ఎలుక రామచందర్,దత్తాత్రేయ రావు,మసాడి శ్రీరాములు,బోనగిరి చంద్రశేఖర్,బోడ సతీష్,మొగిలి శంకర్,జాడి పోచం,దుర్గం శ్రీనివాస్,క్రిస్టఫర్,గోమాస తిరుపతి,పుప్పలా తిరుపతి,మణి కుమార్,ప్రదీప్ రావు,బాబు ఖాన్,చింటూ,ఈక్బాల్, రాకేష్,తదితరులు పాల్గొన్నారు.